ఏ నంబరులో బ్యాటింగ్ చేయడానికైనా నేను సిద్ధం: రోహిత్

ABN , First Publish Date - 2020-11-23T02:18:21+05:30 IST

గాయం కారణంగా ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ

ఏ నంబరులో బ్యాటింగ్ చేయడానికైనా నేను సిద్ధం: రోహిత్

బెంగళూరు: గాయం కారణంగా ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ.. టెస్టు సిరీస్‌లో మాత్రం ఆడనున్నాడు. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గానే కాకుండా జట్టు అవసరాన్ని బట్టి ఏ నంబరులో ఆడాలని మేనేజ్‌మెంట్ ఆదేశిస్తే, అదే నంబరులో బ్యాటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. తొలి టెస్టు తర్వాత కెప్టెన్ కోహ్లీ ఇండియాకు తిరిగి రానున్నాడు. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానే, చతేశ్వర్ పుజారాతో కలిసి రోహిత్ కీలక పాత్ర పోషించనున్నాడు.


ఓపెనర్‌గా తన పాత్రను వారు మారుస్తారో, లేదో తనకు తెలియదని, తానైతే వారు ఎక్కడ బ్యాటింగ్ చేయమన్నా సంతోషంగా దిగుతానని చెప్పుకొచ్చాడు. తాను ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాతే బ్యాటింగ్ ఆర్డర్‌లో తన స్థానం ఎక్కడనేది మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుందని భావిస్తున్నట్టు చెప్పాడు. రోహిత్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిటినెస్ పెంచుకున పనిలో ఉన్నాడు.   

Updated Date - 2020-11-23T02:18:21+05:30 IST