Advertisement
Advertisement
Abn logo
Advertisement

హరా భరా కబాబ్‌

కావలసిన పదార్థాలు: 

పాలకూర: రెండు కప్పులు, బంగాళాదుంపలు: నాలుగు, పచ్చి బఠాణీలు: కప్పు, అల్లం- ఓ ముక్క, పచ్చి మిర్చి: 3, కార్న్‌ ఫ్లోర్‌: 3 స్పూన్లు, సెనగపిండి: ఓ స్పూను, గరం మసాలా పొడి, చాట్‌ మసాలా పొడి: సగం స్పూను, నీళ్లు, నూనె: తగినంత


తయారు చేసే విధానం: వెచ్చని నీళ్లలో పాలకూరను కడిగి కత్తిరించాలి. సెనగపిండిని ప్యాన్‌లో వేయించి పక్కనపెట్టాలి. బంగళా దుంపలు, పచ్చిబఠానీలను ఉడికించి ముద్దగా చేయాలి. పచ్చి మిర్చి, అల్లాన్ని ముక్కలుగా చేసుకోవాలి. ఓ గిన్నెలో పాలకూర తురుము, బంగాళా దుంప, పచ్చి బఠానీలు, మసాలా పొడులు, ఉప్పు, సెనగపిండిని వేసి కాస్త నీళ్లతో ముద్దగా కలుపుకోవాలి. చేత్తో చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. పాన్‌ మీద ఓ స్పూను నూనె లేదా నెయ్యి వేసి ఒక్కో ముద్దను దోరగా కాల్చాలి. కొత్తిమీర చట్నీ లేదా టమోటా కెచప్‌తో హరా భరా కబాబ్‌లు ఎంతో రుచిగా ఉంటాయి.

చిత్రాన్నంచైనీస్‌ పాన్‌కేక్స్‌ఇడ్లీ ఫ్రైమ్యాంగో ఫిర్నిసాంబార్‌ పొడిమ్యాంగో ఐస్‌ టీకార్న్‌ క్యాప్సికమ్‌ సాండ్‌విచ్‌తాజా నెయ్యి ఇంట్లోనే...సొరకాయ కూటు పచ్చి మామిడి జెల్లీ
Advertisement