డీజీపీని కలిసిన పౌరహక్కుల నేత హరగోపాల్

ABN , First Publish Date - 2020-02-23T01:08:42+05:30 IST

డీజీపీ మహేందర్‌రెడ్డిని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ కలిశారు. అరెస్ట్‌ చేసిన ప్రజాసంఘాల నేతలకు తక్షణం బెయిల్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

డీజీపీని కలిసిన పౌరహక్కుల నేత హరగోపాల్

హైదరాబాద్‌: డీజీపీ మహేందర్‌రెడ్డిని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ కలిశారు. అరెస్ట్‌ చేసిన ప్రజాసంఘాల నేతలకు తక్షణం బెయిల్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరగబోయే అరెస్ట్‌లు ఆపాలని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం కల్పించాలన్నారు. ఉద్యమాల ద్వారానే ప్రజాస్వామ్య విలువలు రక్షించుకోవాలని హరగోపాల్‌ పిలుపునిచ్చారు. ఇటీవల తెలంగాణలో విద్యార్థి, మహిళా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గద్వాలలో తెలంగాణ విద్యార్థి వేదికకు చెందిన నాగన్న, బలరాంలను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో జగన్ అనే అధ్యాపకుడి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటుగా చైతన్య మహిళా సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దేవేంద్ర, స్వప్నలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో వీరిని అరెస్ట్ చేసి.. కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఆ తర్వాత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు గంటలుగా సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, రెండు బ్యాగుల విప్లవ సాహిత్యం, కరపత్రాలను గజ్వేల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాశీంను పోలీసులు అదుపులోకి తీసుకుని గజ్వేల్‌కు తరలించారు.

Updated Date - 2020-02-23T01:08:42+05:30 IST