Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిల్లు చెల్లించకుండా వేధిస్తున్నారు!

పీఆర్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్‌ ధర్నా


చిత్తూరు సిటీ, నవంబరు 30: బిల్లు చెల్లించకుండా అధికారులు వేధిస్తున్నారంటూ ఐరాల మండలం తాళంబేడువారిపల్లెకు చెందిన కాంట్రాక్టర్‌ గోవిందస్వామి వాపోయారు. ఈ మేరకు మంగళవారం చిత్తూరు డివిజన్‌ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో తాళంబేడువారిపల్లెలో అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించి అధికారులకు తాళాలు ఇచ్చానని చెప్పారు. దీనికి సంబంధించి రూ.3.83 లక్షల బిల్లు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మారడంతో రెండున్నరేళ్లుగా బిల్లుకోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అప్పు చేసి పనులు పూర్తిచేశానని, వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నానన్నారు. అధికారులు బిల్లు చెల్లించకుంటే కుటుంబసమేతంగా కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా.. త్వరలోనే బిల్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Advertisement
Advertisement