Hyderabad: నువ్వు చస్తే మేం అనాథలవుతాం Nanna..!

ABN , First Publish Date - 2022-01-27T12:54:15+05:30 IST

ఫైనాన్స్‌ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దుండిగల్‌ పోలీ్‌సస్టేషన్‌

Hyderabad: నువ్వు చస్తే మేం అనాథలవుతాం Nanna..!

ఫైనాన్స్‌ వ్యాపారుల వేధింపులు

పెట్రోల్‌ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్/దుండిగల్‌: ఫైనాన్స్‌ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దుండిగల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. అందరితోనూ కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఆత్మ హత్యతో స్థానికులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కరోనా కాలంలో చిరు వ్యాపారులపై వేధింపులకు పాల్పడిన ఫైనాన్స్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌జిల్లా, కౌడిపల్లి మండలం, చిలప్‌ గ్రామానికి చెందిన గోిపీ నారాయణ్‌ (41)కు భార్య విజయలక్ష్మి, కుమారుడు సాయి చరణ్‌, కుమార్తె శ్రుతి ఉన్నారు. వీరు భౌరంపేట్‌లో నివాసం ఉంటున్నారు. గోపీ నారాయణ్‌ ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో నాటుకోళ్ల ఫారంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.


మూడు నెలల క్రితం ఫైనాన్స్‌లో టీవీఎస్‌ మోపెడ్‌ కొనుగోలు చేశాడు. కరోనా కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో వాయిదాలు చెల్లించలేక పోయాడు. దీంతో వ్యాపారులు మంగళవారం వాహనాన్ని బలవంతంగా లాక్కుని పోయారు. దీంతో అవమానం, మనస్తాపానికి గురైన నారాయణ్‌ అదే రోజు సాయంత్రం కుమారుడికి ఫోన్‌ చేసి చనిపోతున్నానని చెప్పి గండిమైసమ్మ చౌరస్తా నుంచి బస్సులో మల్లంపేట్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లి మరోసారి కుమారుడికి ఫోన్‌చేసి చెరువులో దూకి చస్తున్నానని చెప్పాడు. ‘వద్దు నాన్న.. నీవు చస్తే మేం అనాథలం అవుతాం’ అని కన్నీటితో వేడుకుంటూ సాయిచరణ్‌ అక్కడకు వెళ్లాడు. తండ్రిని మల్లంపేట్‌లో ఉన్న బంధువుల ఇంటికి ఆ రాత్రి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి బంధువుల ఇంట్లో ఉన్న గోపీనారాయణ్‌ రెండో రోజు 9.30 ప్రాంతంలో భౌరంపేట్‌లోని ఆర్‌కే టౌన్‌షి్‌పలోని ఖాళీ ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దుండిగల్‌ పోలీసులు క్లూస్‌ టీంను రప్పించి వివరాలు సేకరించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-27T12:54:15+05:30 IST