ఆ రోజు అంజలితో కలిసి సచిన్ డ్యాన్స్ చేశారు..: హర్భజన్

ABN , First Publish Date - 2020-04-08T23:14:50+05:30 IST

24 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులను సాధించారు. 1989లో వన్డే జట్టులోకి ఆరంగేట్రం చేసిన

ఆ రోజు అంజలితో కలిసి సచిన్ డ్యాన్స్ చేశారు..: హర్భజన్

ముంబై: 24 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులను సాధించారు. 1989లో వన్డే జట్టులోకి ఆరంగేట్రం చేసిన ఆయన ప్రపంచకప్ టైటిల్ కోసం 22 సంవత్సరాలు ఎదురుచూశారు.  ఎంఎస్ ధోనీ సారథ్యంలో 5వసారి ఆడిన ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్‌ ఆడిన ఆయన తన కలని సాకారం చేసుకన్నారు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీం ఇండియా విశ్వవిజేతగా రెండోసారి అవతరించింది. 


అయితే ఆ జట్టు సభ్యుడైన టీం ఇండియా స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ఆ మ్యాచ్‌కి సంబంధించ ఓ అరుదైన సంఘటనని అభిమానులతో పంచుకున్నారు. అప్పటివరకూ టెండూల్కర్‌ బ్యాటింగ్‌ని మాత్రమే చూసిన తాను.. ఆ రోజులు ఆయన డ్యాన్స్ చేయడం కూడా చేశానని పేర్కొన్నారు. ‘‘సచిన్ బ్యాటింగ్ చేయడం తప్ప మరో పని చేయడం ఎప్పుడు చూడలేదు. కానీ, ఆ రోజు రాత్రి ఆయన సంతోషంగా డ్యాన్స్ చేశారు. అంజలి వదినతో కలిసి హిందీపాటకి చిందులు వేశారు. వాళ్లు ఇద్దరు డ్యాన్స్ చేయడం చూసి మేము చాలా సంతోషించాము. అది ట్రోఫీని ముద్దాడడం ఆయన(సచిన్) కన్న కల’’ అని హర్భజన్ తెలిపారు. 


అయితే ఆ పార్టీ బాధ్యతలను సచిన్ తనపై ఉంచారని పేస్ బౌలర్ అశీష్ నెహ్రా అన్నారు. గాయం కారణంగా నెహ్రా ఆ మ్యాచ్ ఆడలేదు. దీంతో ఖాళీగా ఉన్న అతన్ని పార్టీ ఏర్పాట్లు చూసుకోమని సచిన్ ఆదేశించారని పేర్కొన్నారు. ‘‘పార్టీ జరుగుతున్న గది చాలా చిన్నది. అందులోకి నేనే ముందు వెళ్లాను. మిగితా వాళ్లు అంతా మ్యాచ్ ఆడారు కాబట్టి.. వాళ్లు రూంకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను ‘అంతా సిద్ధంగా ఉంది’ అంటూ అందరి మెసేజ్‌లు పంపుతూ 40 నిమిషాల పాటు ఎదురుచూశాను’’ అని నెహ్రా తెలిపారు.

Updated Date - 2020-04-08T23:14:50+05:30 IST