Advertisement
Advertisement
Abn logo
Advertisement

తన రికార్డును బద్దలుగొట్టిన అశ్విన్‌కు భజ్జీ అభినందనలు

న్యూఢిల్లీ: తన రికార్డును బద్దలుగొట్టిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు హర్భజన్ సింగ్ అభినందనలు తెలిపాడు. న్యూజిలాండ్‌తో కాన్పూరులో జరిగిన తొలి టెస్టులో టామ్ లాథమ్‌ను అవుట్ చేయడం ద్వారా 35 ఏళ్ల అశ్విన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.


హర్భజన్ సింగ్ 103 టెస్టుల్లో 417 వికెట్లు సాధించగా, అశ్విన్ 80 టెస్టుల్లోనే ఆ రికార్డును అధిగమించాడు. అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434) ఉన్నారు. అశ్విన్‌కు అభినందనలు తెలిపిన భజ్జీ.. మరిన్ని వికెట్లు సాధించాని ఆకాంక్షించాడు. మరోవైపు, అభిమానులు కూడా అభినందనలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 

Advertisement
Advertisement