ఆ విషయం ఎవరికీ తెలీదు

ABN , First Publish Date - 2020-06-05T09:17:53+05:30 IST

భారత క్రికెట్‌లో ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ ఏడాది జనవరి ఒకటిన సెర్బియా నటి నటాషా...

ఆ విషయం ఎవరికీ తెలీదు

నిశ్చితార్థంపై హార్దిక్‌ పాండ్యా

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ ఏడాది జనవరి ఒకటిన సెర్బియా నటి నటాషా స్టాన్‌కోవిచ్‌తో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలీదని హార్దిక్‌ వెల్లడించాడు. ‘మా మమ్మీ, డాడీలకు ఈ విషయం గురించి నేనేమీ చెప్పలేదు. అన్నయ్య క్రునాల్‌కు కూడా కేవలం రెండ్రోజుల ముందే చెప్పా. జీవితంలో సరైన వ్యక్తి లభించిందనుకున్నా. అలాగే వ్యక్తిగా కూడా నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు నా గురించే కాకుండా మరో వ్యక్తి గురించి కూడా ఆలోచించగలుగుతున్నా’ అని పాండ్యా తెలిపాడు.

Updated Date - 2020-06-05T09:17:53+05:30 IST