అప్పుడే హార్దిక్‌ను తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-18T08:03:22+05:30 IST

వామప్‌ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌లో సత్తా చాటితేనే హార్దిక్‌ పాండ్యాను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ సూచించాడు.

అప్పుడే హార్దిక్‌ను తీసుకోవాలి

దుబాయ్‌: వామప్‌ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌లో సత్తా చాటితేనే  హార్దిక్‌ పాండ్యాను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ సూచించాడు. 2019లో వెన్నెముకకు ఆపరేషన్‌ చేయించుకున్నాక హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌కు దూ రంగా ఉంటున్నాడు. మరోవైపు స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానం లో శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకున్నారు. అంటే..మెగా టోర్నీలో హార్దిక్‌ బౌలింగ్‌ చేయడంలేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో గంభీర్‌ స్పందిస్తూ ‘నెట్స్‌లోనేకాదు రెండు వామప్‌ పోటీల్లో బౌలింగ్‌లో రాణిస్తేనే హార్దిక్‌ను తుది 11 మందిలో తీసుకోవా లి. నెట్స్‌లో బౌలింగ్‌కు....బాబర్‌ ఆజమ్‌ వంటి బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్‌ చేయడంలో ఎంతో తేడా ఉంటుంది’ అని అన్నాడు.

Updated Date - 2021-10-18T08:03:22+05:30 IST