99మీటర్ల సిక్సర్ కొట్టిన సూర్యకుమార్.. హార్దిక్ రియాక్షన్ వైరల్!

ABN , First Publish Date - 2021-04-14T11:10:53+05:30 IST

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తాజాగా జరిగిన మ్యాచులో సూర్యకుమార్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు.

99మీటర్ల సిక్సర్ కొట్టిన సూర్యకుమార్.. హార్దిక్ రియాక్షన్ వైరల్!

చెన్నై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తాజాగా జరిగిన మ్యాచులో సూర్యకుమార్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. కేకేఆర్ పేసర్ ప్యాట్ కమిన్స్ వేసిన ఓవర్ ఐదో బంతిని సూర్యకుమార్ స్టాండ్స్‌లోకి పంపాడు. గంటకు 135.1కిమీల వేగంతో దూసుకొచ్చిన బంతిని డీప్ స్క్వేర్ దిశగా భారీ సిక్సర్‌గా మలిచాడు.


99 మీటర్ల దూరం వెళ్లిన ఈ సిక్సర్ అభిమానులను అలరించింది. ఈ సిక్సర్ కొట్టిన సమయంలో సూర్యకుమార్ సహచరుడు హార్దిక్ పాండ్యా స్టాండ్స్‌లో నిలబడి ఇచ్చిన రియాక్షన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ షాట్ చూసి షాకైనట్లు కనబడుతున్న హార్దిక్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రస్తుతం నెట్టంట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

Updated Date - 2021-04-14T11:10:53+05:30 IST