Oct 21 2021 @ 10:28AM

'హరి హర వీరమల్లు': కొత్త షెడ్యూల్‌లో జాక్వెలిన్, అర్జున్ రామ్ పాల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా 'హరి హర వీరమల్లు'. ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభిచడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కొత్త షెడ్యూల్‌లో బాలీవుడ్ నటీ నటులు జాక్వెలిన్ ఫెర్నాండస్, అర్జున్ రామ్ పాల్ పాల్గొనబోతున్నట్టు తాజా సమాచారం. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొత్తం నాలుగు భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తైనట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.