'హరిహర వీరమల్లు': డిసెంబర్ చివరి వారం నుంచి కొత్త షెడ్యూల్..!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవనుందని తాజా సమాచారం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌పై అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం పాన్ ఇండియన్ లెవెల్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమా కోసం చిత్రబృందం ఇటీవలే కొత్త లొకేషన్స్‌ను ఫైనల్ చేసింది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాం పాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాటికే చిత్రీకరణ పూర్తవ్వాల్సి ఉండగా.. కొవిడ్ వేవ్స్‌తో పాటు ఇతర కారణాల వల్ల 'హరిహర వీరమల్లు' చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కాగా, ఎట్టకేలకు మళ్ళీ ఇప్పుడు వీరమల్లు చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురానున్నారు. డిసెంబర్ చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న 'భీమ్లా నాయక్' రిలీజ్‌కు రెడీ అవుతోంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

Advertisement