Aug 2 2021 @ 05:03AM

‘7 డేస్‌ 6 నైట్స్‌’ తర్వాత హరికథ

ప్రస్తుతం ‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రానికి ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత చేయబోయే సినిమా పనులనూ ఆయన ప్రారంభించినట్టు తెలిసింది. ఆ చిత్రానికి ‘హరికథ’ టైటిల్‌ ఖరారు చేశారని వినికిడి. ‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎంఎస్‌ రాజు తనయుడు, హీరో సుమంత్‌ ఆశ్విన్‌... తమ నిర్మాణ సంస్థపై ‘హరికథ’ నిర్మించనున్నారట. ప్రస్తుతం హీరో, ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ నెల మూడో వారానికి ‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ వెంటనే ‘హరికథ’ సెట్స్‌ మీదకు వెళ్లనుంది. సినిమా కథ, కథనాలు కొత్తగా ఉంటాయట. త్వరలో అధికారికంగా చిత్రాన్ని ప్రకటించనున్నారు.