థర్డ్‌వేవ్ దృష్ట్యా అప్రమత్తంగా ఉన్నాం: మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-12-14T00:38:31+05:30 IST

థర్డ్‌వేవ్ దృష్ట్యా అప్రమత్తంగా ఉన్నామని మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణ లో ఒమిక్రాన్ కేసులు అయితే నమోదు కాలేదని, కానీ అన్నివిధాల సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

థర్డ్‌వేవ్ దృష్ట్యా అప్రమత్తంగా ఉన్నాం: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌: థర్డ్‌వేవ్ దృష్ట్యా అప్రమత్తంగా ఉన్నామని మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణ లో ఒమిక్రాన్ కేసులు అయితే నమోదు కాలేదని, కానీ అన్నివిధాల సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రేపు సన్నద్ధంపై ఉన్నతాధికారులతో సమావేశం ఉందని, కిట్స్, మందులు, బెడ్స్ ముందస్తు జాగ్రత్తలపై సమావేశం అవుతున్నామన్నారు. T డైగ్నోస్టిక్ట్ సేవలు అద్భుతంగా అందుతున్నాయన్నారు. రాష్ట్రంలోని మిగితా 13 జిల్లాలో ప్రారంభానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. కేంద్రం నుంచి మంచి గుర్తింపు వస్తోందని, ఆరోగ్య పరంగా మంచి ఫలితాలు వస్తున్నాయని 2 అవార్డులు అందుకున్నామన్నారు. నిలోఫర్‌లో కూడా ఇక్కడున్న సమస్యలు, సదుపాయాల మెరుగుపరుచుకునేందుకు చర్చించామన్నారు. 

Updated Date - 2021-12-14T00:38:31+05:30 IST