Abn logo
Jun 14 2021 @ 15:00PM

కేంద్రమే ఆ విషయంపై లేఖ రాసింది: హరీష్‌రావు

సంగారెడ్డి: కేంద్రమే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  చరిత్రలో ఇప్పుడే భూములు అమ్ముతున్నట్లు.. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. భూములు అమ్మనివ్వబోమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అనడం అవివేకమన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిల హయాంలో 88,500 ఎకరాలు అమ్మారని చెప్పారు. నాడు హైదరాబాద్ భూములు అమ్మి కడపకు నిధులు తరలించారన్నారు. సంస్కరణలను ప్రారంభించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగించడం లేదా? అని నిలదీశారు. కరోనా కాలంలో ప్రభుత్వ ఆదాయం తగ్గిందన్నారు. అందుకే భూములు అమ్మి పథకాలు కొనసాగిస్తామని హరీష్‌రావు స్పష్టం చేశారు.