Oct 24 2021 @ 14:06PM

త్రివిక్రమ్ శిష్యుడి వెరైటీ థ్రిల్లర్ ‘టాక్సీ’

టాలీవుడ్ క్రియేటివ్ జీనియస్ త్రివిక్రమ్ శ్రీనివాస్  దగ్గర చాలా సినిమాలకు అసోసియేట్ గా పనిచేసిన హరీశ్ సజ్జా. దర్శకుడిగా తొలి అవకాశం అందుకున్నారు. సినిమా పేరు టాక్సీ. గ్రిప్పింగ్ స్ర్కీ్న్ ప్లేతో ఆసక్తికరమైన సన్నివేశాలతో రూపొందనున్న ఈ సినిమాలో వసంత్ సమీర్ పిన్నమరాజు హీరోగా నటిస్తున్నారు. ఇంకా అల్మాస్ మొటీవాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్యా మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హెచ్ అండ్ హెచ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా నిర్మిస్తోన్నఈ సినిమాకి మార్క్ రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ‘టాక్సీ’ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను నేడు సోషల్ మీడియాలో విడుదల చేశారు మేకర్స్. ఒక పిస్టల్ పై టాక్సీ పయనిస్తున్నట్టుగా విడుదలైన ఈ ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ను బట్టి చూస్తుంటే.. ఇదో క్రైమ్ థ్రిల్లర్ గా అర్ధమవుతోంది. అలాగే.. ఇందులో టాక్సీ ప్రధాన పాత్ర పోషిస్తోందని కూడా తెలుస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ రోజు ఇండియా పాక్ మ్యాచ్ సందర్భంగా.. ఇండియన్ టీమ్ కు బెస్ట్ విషెస్ చెబుతూ.. ఆ మ్యాచ్ లాంటిదే మా సినిమా కూడా అని అర్ధం వచ్చేలా పోస్టర్ ను రివీల్ చేయడం ఆకట్టుకుంటోంది.