సాక్షి పత్రికను బహిష్కరించాలి: హర్షకుమార్

ABN , First Publish Date - 2021-04-16T20:03:03+05:30 IST

వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రభుత్వం చేతిలో మోసపోయామన్న బావన...

సాక్షి పత్రికను బహిష్కరించాలి: హర్షకుమార్

రాజమండ్రి: వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రభుత్వం చేతిలో మోసపోయామన్న బావన వ్యక్తమవుతుందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున ప్రభుత్వంపై దళితుల వ్యతిరేకత చూశామన్నారు. సాక్షి పత్రికలో అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా అంబేద్కర్ పోటో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సాక్షి పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి పత్రికపై ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల వ్యాఖ్యలు చూస్తే సాక్షి పత్రిక తీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. దళితులతో పాటు అంబేద్కర్ వాదులంతా సాక్షి పత్రికను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. జడ్జి రామకృష్ణపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. దళితులకు సంక్షేమ పథకాలు రద్దు చేశారని, గతంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ కోఆర్డినేటర్లకు ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్లను కేటాయించటం చట్ట విరుద్ధమని హర్షకుమార్ అన్నారు.

Updated Date - 2021-04-16T20:03:03+05:30 IST