ప్లస్‌ టూఫలితాల్లో హార్వెస్టు విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2020-07-14T11:13:57+05:30 IST

సీబీఎస్‌ఈ 12వతరగతి ఫలితాల్లో నగరానికి చెందిన హార్వెస్ట్‌ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రతిభ చాటారని

ప్లస్‌ టూఫలితాల్లో హార్వెస్టు విద్యార్థుల ప్రతిభ

ఖానాపురంహవేలి, జూలై13: సీబీఎస్‌ఈ 12వతరగతి ఫలితాల్లో నగరానికి చెందిన హార్వెస్ట్‌ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రతిభ చాటారని కళాశాల కరస్పాండెంట్‌ రవిమారుత్‌, ప్రిన్సిపాల్‌ పార్వతీరెడ్డి తెలిపారు. ఎంపీసీలో 500మార్కులకు 490మార్కులతో యు.ముఖేష్‌ ప్రథమస్థానంలో, 481మార్కులతో బిశ్రీదివ్య ద్వితీయస్థానం, 480మార్కులతో సత్యజిత్‌ తృతీయస్థానం, సీహెచ్‌ ఐశ్వర్య 478, బి.లక్ష్మిప్రసన్న, కె.అనిరుద్‌ 477మార్కులతో నిలిచారని తెలిపారు.


బైపీసీలో ఎం.టీనాచౌదరి 473మార్కులతో ప్రథమ స్థానంలో, బి.జాహ్నవి 449, ఎస్‌.మౌనిక465, ఉదయ్‌కిరణ్‌ చౌహాన్‌ 462మార్కులు సాధించారని తెలిపారు. ఎంఈసీలో సంజన 451మార్కులతో ప్రథమస్థానం, వర్గత్‌ హరీష్‌449, మర్రి శివప్రసాద్‌ 445మార్కులు సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించింది.  122 మంది విద్యార్థులలో 19మంది 475పైగా మార్కులు సాధించగా 32మంది 450కుపైగా మార్కులు సాధించారని తెలిపారు. ఈవిజయం మరెన్నో భవిష్యత కార్యక్రమాలకు పునాదిగా నిలుస్తుందని కరస్పాండెంట్‌ రవిమారుత్‌, ప్రిన్సిపాల్‌ పార్వతీరెడ్డి  తెలిపారు.

Updated Date - 2020-07-14T11:13:57+05:30 IST