Abn logo
Apr 19 2021 @ 00:50AM

వరికోత మిషన్‌ దగ్ధం

పెద్దవంగర, ఏప్రి ల్‌ 18 : మండలం లోని ఎల్‌బీతండాలో ప్రమాదవశాత్తు ఆదివారం హార్వెస్టర్‌ దగ్ధమైంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. ఎల్‌బీతండా  సర్పంచ్‌ జాటోత్‌ తారాపూల్‌సింగ్‌కు చెందిన హార్వెస్టర్‌తో తండా శివారులో మొక్కజొన్న పంటను కోస్తుండగా మరమ్మతుకు గురైంది. హార్వెస్టర్‌ని నిలిపివేసి రిపేర్‌ చేస్తుండగా ఇంజన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదంంలో రూ.30 లక్షలు వాటిల్లినట్లు సర్పంచ్‌ కుటుంబ సభ్యులు వాపోయారు. 

Advertisement
Advertisement