హరియాణాలో లాక్‌డౌన్ పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-14T05:27:42+05:30 IST

కరోనా కట్టడి దృష్ట్యా హరియాణా ప్రభుత్వం లాక్‌డౌన్ జూన్ 21 వరకూ పొడిగించింది.

హరియాణాలో లాక్‌డౌన్ పొడిగింపు

చండీగఢ్: కరోనా కట్టడి కోసం హరియాణా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూన్ 21 వరకూ పొడిగించింది. అదే సమయంలో..కరోనా తీవ్రత తక్కువగా ఉండటంతో కొన్ని సడలింపులు కూడా ప్రకటించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. షాపులు ఉదయం తొమ్మది నుంచీ రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంచొచ్చు. షాపింగ్ మాల్స్‌ను ఉయదం 10 గంటలకు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇక రెస్టారెంట్ల కార్యకలాపాలను ఉదయం పది నుంచి రాత్రి పది గంటలవరకూ ప్రభుత్వం అనుమతించింది. అయితే..సీటింగ్ సామర్థ్యంలో కేవలం 50 శాతాన్ని మాత్రమే వినియెగించుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు మినహా ఇతర సమాయాల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసర సేవలకు మునుపటి నిబంధనలే వర్తిస్థాయని పేర్కొంది.

Updated Date - 2021-06-14T05:27:42+05:30 IST