16ఏళ్ల కూతురు ఆస్పత్రిలో ఉందంటే వెళ్లాడు.. అక్కడ ఆ అమ్మాయి ఉన్న కండీషన్ చూసి షాకైన తండ్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2021-10-12T17:40:31+05:30 IST

రాత్రి నుంచి కూతురు కనిపించని..

16ఏళ్ల కూతురు ఆస్పత్రిలో ఉందంటే వెళ్లాడు.. అక్కడ ఆ అమ్మాయి ఉన్న కండీషన్ చూసి షాకైన తండ్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

ఇంటర్‌నెట్‌డెస్క్: రాత్రి నుంచి కూతురి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు మరుసటి రోజు పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ కూతురు ఆస్పత్రిలో ఉందని చెప్పారు. తల్లిదండ్రుల మనసు కీడు శంకించింది. జరగరానిదేదో జరిగిందేమోనని భయపడ్డారు. ఆస్పత్రికి వెళ్లిన తండ్రి కూతురును చూసి షాక్‌కు గురయ్యాడు. తన కూతురికి జరిగిన అన్యాయం తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. ఈ సంఘటన హర్యాణా రాష్ట్రం హిసార్ జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


మంగళవారం ఉదయం ఆడంపూర్ పోలీస్‌స్టేషన్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘సార్.. ఇక్కడ ఓ అమ్మాయి నడవలేని స్థితిలో ఉంది. వచ్చి చూడండి’అంటూ ఓ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. ఆ వ్యక్తి చెప్పిన ప్రాంతానికి కొంతమంది పోలీసులు వెళ్లి.. ఆ అమ్మాయిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆమెను వివరాలు అడగ్గా.. జరిగిన అన్యాయం గురించి చెప్పింది. అలాగే ఆమె తన తండ్రి ఫోన్ నంబర్ ఇచ్చింది. పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి.. తండ్రికి ఫోన్ చేశారు.



రాత్రి నుంచి కనిపించని కూతురు ఆస్పత్రిలో ఉందని పోలీసులు చెప్పడంతో.. తల్లిదండ్రులు భయపడ్డారు. ఏమైందోనని తండ్రి, మేనమామ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కూతురు ఉన్న పరిస్థితి చూసి తండ్రి కంగుతిన్నాడు. ఆ అమ్మాయి నడవలేని స్థితిలో ఉంది. ఏమైందని పోలీసులను అడగ్గా వారి అసలు విషయం చెప్పారు. ‘మీ ఇంటి దగ్గర్లో ఉన్న సునీల్ అనే వ్యక్తి.. నిన్న సాయంత్రం మీ ఇంటికి వచ్చాడు. అతను ఇచ్చిన మత్తు పదార్థం కలిపిన ఆహారం తినడంతో మీ కూతురు స్పృహ కోల్పోయింది. ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆడంపూర్ ప్రాంతంలో విడిచి వెళ్లాడు. స్థానికులు సమాచారం అందించడంతో.. మా కానిస్టేబుళ్లు వెళ్లి అమ్మాయిని తీసుకొచ్చారు’అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు.

Updated Date - 2021-10-12T17:40:31+05:30 IST