పదేళ్లకే వ్యాపారవేత్తగా రాణిస్తోంది..!

ABN , First Publish Date - 2020-09-12T05:30:00+05:30 IST

చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది చెన్నైకు చెందిన వినూష.

పదేళ్లకే వ్యాపారవేత్తగా రాణిస్తోంది..!

చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది చెన్నైకు చెందిన వినూష. ‘ఫోర్‌ సీజన్‌ పాస్ట్రీ’ పేరుతో సొంతంగా బ్రాండ్‌ని క్రియేట్‌ 

చేసుకుని రాణిస్తోంది.


వినూష గత ఏడాది తన పుట్టిన రోజు వేడుకల సమయంలో యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ కేక్‌ తయారుచేసి వాళ్ల అమ్మను సర్‌ప్రైజ్‌ చేసింది. తరువాత కప్‌కేక్‌లు తయారుచేయడం ప్రారంభించింది.


వినూష ఆసక్తిని గమనించిన ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతోనే ‘ఫోర్‌ సీజన్స్‌ పాస్ట్రీ’ని ప్రారంభించింది. కప్‌కేక్‌లు తయారుచేయడం, అమ్మడం మొదలుపెట్టింది. 


‘‘నేను తయారుచేసి అమ్మే కప్‌కేక్‌లు నాలుగు సీజన్లకు ప్రతీకలుగా ఉంటాయి. నేను కేక్‌ల తయారీలో ఉపయోగించే క్రీమ్‌ ప్రత్యేకమైనది’’ అని అంటుంది వినూష.


వినూష ఇప్పటి వరకు 600 కప్‌కేక్‌లు అమ్మింది. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఇంటర్న్‌షి్‌ప కూడా పూర్తి చేసింది. అంతేకాకుండా బేకింగ్‌ కిట్‌ను తయారుచేసి ముంబైలో జరిగిన యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఎగ్జిబిషన్‌లో విడుదల చేసింది. ‘నా బ్రాండ్‌ను నంబర్‌ వన్‌గా నిలపాలన్నదే నా లక్ష్యం’  అంటున్న వినూషకు ఆల్‌ ద బెస్ట్‌ చెబుదాం.

Updated Date - 2020-09-12T05:30:00+05:30 IST