బుగ్గలు గిల్లి పెళ్లి కొడుకు చేతిలో దెబ్బలు తిన్న అతిథి

ABN , First Publish Date - 2021-06-16T00:37:28+05:30 IST

పెళ్లికి వచ్చిన అతిథి.. నూతన వధూవరులను అభినంది వెళ్లడం సహజంగా జరిగేదే. బాగా చనువు ఉన్నవాళ్లయితే కాస్త సరదా కబుర్లతో వారిని ఆటపట్టిస్తుంటారు.

బుగ్గలు గిల్లి పెళ్లి కొడుకు చేతిలో దెబ్బలు తిన్న అతిథి

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లికి వచ్చిన అతిథి.. నూతన వధూవరులను అభినంది వెళ్లడం సహజంగా జరిగేదే. బాగా చనువు ఉన్నవాళ్లయితే కాస్త సరదా కబుర్లతో వారిని ఆటపట్టిస్తుంటారు. పెళ్లి వేదికపై నవ్వుల వర్షం కురిపిస్తారు. ఒక్కోసారి ఆ నవ్వులు కాస్తా తీవ్ర యుద్ధాలకే దారి తీస్తుంటాయి. ఇదిగో ఈ పెళ్లిలో అలాగే జరిగింది. పెళ్లి కొడుకుతో ఓ వ్యక్తి చేసిన అల్లరి మామూలు రచ్చ సృష్టించలేదు. అతన్ని నాలుగు పీకే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. కొత్త దంపతులకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓ వ్యక్తి వేదిక ఎక్కి.. కొత్త పెళ్లి కొడుకును ఆటపట్టించేందుకు యత్నించాడు. అతడి బుగ్గలు గట్టిగా గిల్లాడు. అంతేగాక తానేదో ఘనకార్యం చేసినట్టు తెగ నవ్వుతున్నాడు. దీంతో ఆ పెళ్లి కొడుక్కి చిర్రెత్తుకు వచ్చింది. అంతే.. ఒక్క ఉదుటన లేచి.. ఠపీ.. ఠపీ అంటూ గట్టిగా కొట్టాడు. పెళ్లి కూతురు ఎంత ఆపినా.. ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.




దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది రెండేళ్ల క్రితం నాటి వీడియోగా కొంతమంది చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హసన్ పూర్ జిల్లాలో జరిగినట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారడంతో మరోసారి నవ్వుల వర్షం కురిపిస్తోంది.

Updated Date - 2021-06-16T00:37:28+05:30 IST