తొందరపాటు నిర్ణయం: చింతా

ABN , First Publish Date - 2020-06-06T10:07:22+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపులతో తిరుమలకు భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్యగా కనిపిస్తోందని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ అభిప్రాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తిరుపతిని కొవిడ్‌

తొందరపాటు నిర్ణయం: చింతా

తిరుపతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సడలింపులతో తిరుమలకు భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్యగా కనిపిస్తోందని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ అభిప్రాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తిరుపతిని కొవిడ్‌ వ్యాప్తితో ముంబై, ఢిల్లీ సరసన చేర్చేందుకు ఉబలాటపడుతోందని ఆరోపించారు. భక్తులకు రేణిగుంట, చంద్రగిరి, కరకంబాడి ప్రాంతాల్లోనే కరోనా పరీక్షలు చేపట్టాలని సూచించారు. కేవలం థర్మల్‌ స్ర్కీనింగ్‌తో తిరుమలకు అనుమతిస్తే తిరుపతి ప్రజలు తీవ్రమైన సమస్యను చవిచూడాల్సి వస్తుందని, దీనికి పూర్తి బాధ్యత టీటీడీ అధికారులు, పాలకమండలిదేనన్నారు.

Updated Date - 2020-06-06T10:07:22+05:30 IST