సిడ్నీలో సిక్కులపై దుండగుల దాడి..!

ABN , First Publish Date - 2021-03-05T00:17:17+05:30 IST

కొందరు గుర్తు తెలియని దుండగులు సిక్కులు వెళ్తున్న వాహనంపై విచక్షణరహితంగా దాడికి పాల్పడిన ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో చోటుచేసుకుంది.

సిడ్నీలో సిక్కులపై దుండగుల దాడి..!

సిడ్నీ: కొందరు గుర్తు తెలియని దుండగులు సిక్కులు వెళ్తున్న వాహనంపై విచక్షణరహితంగా దాడికి పాల్పడిన ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో చోటుచేసుకుంది. తాము తలపై టర్బన్ ధరించి ఉండడంతో విద్వేషపూరితంగానే తమపై దుండగులు దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఆదివారం రాత్రి వెస్ట్ సిడ్నీలోని హ్యారిస్ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. సిక్కులు వెళ్తున్న కారును ఆపిన కొందరు దుండగులు ఒక్కసారిగా వాహనంపై విరుచుకుపడ్డారు. 


కారు అద్దాలను ధ్వంసం చేసి, అందులోని వ్యక్తులపై కూడా దాడి చేయడం వీడియోలో ఉంది. వారి నుంచి తప్పించుకుబోయిన బాధితులను వెంబడించి మరీ దాడి చేయడం వీడియోలో రికార్డైంది. కారులో ఉన్న తనతో పాటు తన స్నేహితులు తలపై టర్బన్ ధరించి ఉండడం చూసే దుండగులు తమపై దాడికి పాల్పడినట్లు బాధితుడు ఒకరు వెల్లడించాడు. దుండగులు విద్వేషపూరితంగానే తమపై దాడి చేశారని తెలిపాడు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసుకున్న సిడ్నీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-03-05T00:17:17+05:30 IST