Abn logo
Nov 22 2020 @ 18:31PM

హథ్రాస్ నిందితులకు పాలీగ్రాఫ్ టెస్టులు

Kaakateeya

అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసులో నలుగురు నిందితులను గుజరాత్‌లోని గాంధీనగర్‌కు సీబీఐ అధికారులు ఆదివారంనాడు తీసుకు వచ్చారు. అలీగఢ్ జైలు నుంచి వీరిని గుజరాత్ తీసుకువచ్చారు. వీరికి బ్రెయిన్ మాపింగ్ పరీక్షలతో పాటు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

హథ్రాస్‌లో దళిత బాలికపై సెప్టెంబర్ 14న సామూహిక అత్యాచారం జరగడం, తీవ్రగాయాలతో ఢిల్లీలోని సఫ్తర్ జంగ్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ అదేనెల 29న మరణించడం సంచలనం సృష్టించింది. బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా, వారి పరోక్షంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు, జిల్లా యంత్రాంగం దహనక్రియలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించగా, సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాల్సిందిగా అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement