యూపీ సర్కారు, పోలీసు చీఫ్‌లకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

ABN , First Publish Date - 2020-10-01T15:34:48+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ దళిత యువతిపై హత్యాచారం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ( ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది....

యూపీ సర్కారు, పోలీసు చీఫ్‌లకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

హత్రాస్ హత్యాచారం కేసుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటో విచారణ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ దళిత యువతిపై హత్యాచారం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ( ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ దారుణ సామూహిక అత్యాచార ఘటనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, యూపీ డీజీపీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఈ మేర యూపీ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీలకు నోటీసులు పంపించింది. నాలుగు వారాల్లోగా యూపీ సర్కారు, డీజీపీలు నివేదికలు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. 


దళిత యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపి హింసిస్తే పోలీసలు సకాలంలో చర్య తీసుకోకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కూతురి మృతదేహాన్ని బలవంతంగా పోలీసులు దహనం చేశారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించిన నేపథ్యంలో దీనిపై కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టిసారించింది. 

Updated Date - 2020-10-01T15:34:48+05:30 IST