Hatrickతో చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్

ABN , First Publish Date - 2021-08-07T09:17:48+05:30 IST

ఆసీస్ బౌలర్ నాథన్ ఎల్లిస్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఫీట్ సాధించి రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య..

Hatrickతో చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్

ఆసీస్ బౌలర్ నాథన్ ఎల్లిస్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఫీట్ సాధించి రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఎల్లిస్ తొలిసారిగా అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించి టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అది కూడా మహమ్మదుల్లా, మెహెదీహసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ వంటి కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు.


ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆసీస్ పేసర్ నాథన్ హ్యాట్రిక్ తీసినా ఆసీస్ ఈ మ్యాచ్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ తరపున మహ్మదుల్లా(52) ఒక్కడే అర్థసెంచరీ చేశాడు. మిగతా ఆటగాళ్లంతా పేలవ ప్రదర్శనే చేశారు. దీనికి తోడు ఎల్లిస్ హ్యాట్రిక్‌తో అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 127 పరుగులు మాత్రమే చేశారు. 


అయితే ఇంత తక్కువ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ సునాయాసంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ 20 ఓవర్లో ఆడిన ఆసీస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యారు. ఆసీస్ తరపున మిచెల్ మార్ష్(51) మాత్రమే అర్థ సెంచరీ చేశాడు. దీంతో 10 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.



Updated Date - 2021-08-07T09:17:48+05:30 IST