ఈ పోస్టులకు అప్లై చేశారా.. ప్రారంభవేతనమే రూ.41 వేలు

ABN , First Publish Date - 2021-08-28T13:53:47+05:30 IST

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)- ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 220 పోస్టులు ప్రకటించారు. జనరల్‌ అభ్యర్థులకు 90, ఓబీసీల

ఈ పోస్టులకు అప్లై చేశారా.. ప్రారంభవేతనమే రూ.41 వేలు

స్పోర్ట్స్‌ అథారిటీలో అసిస్టెంట్‌ కోచ్‌లు

మొత్తం పోస్టులు 220 


న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)- ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 220 పోస్టులు ప్రకటించారు. జనరల్‌ అభ్యర్థులకు 90, ఓబీసీలకు 59, ఎస్సీలకు 33, ఎస్టీలకు 16, ఈడబ్ల్యుఎస్‌ వర్గానికి 22 పోస్టులు ప్రత్యేకించారు. ప్రస్తుతంలో సాయ్‌లో పనిచేస్తున్న కోచ్‌లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


క్రీడలవారీ ఖాళీలు: ఆర్చరీ 13, అథ్లెటిక్స్‌ 20, బాస్కెట్‌బాల్‌ 6, బాక్సింగ్‌ 13, సైక్లింగ్‌ 13, ఫెన్సింగ్‌ 13, ఫుట్‌బాల్‌ 10, జిమ్నాస్టిక్స్‌ 6, హ్యాండ్‌బాల్‌ 3, హాకీ 13, జూడో 13, కబడ్డీ 5, కరాటే 4, కయాకింగ్‌ అండ్‌ కనోయింగ్‌ 6, ఖోఖో 2, రోయింగ్‌ 13, సెపక్‌తక్రా 5, షూటింగ్‌ 3, సాఫ్ట్‌బాల్‌ 1, స్విమ్మింగ్‌ 7, టేబుల్‌టెన్నిస్‌ 7, తైక్వాండో 6, వాలీబాల్‌ 6, వెయిట్‌లిఫ్టింగ్‌ 13, రెస్టిలింగ్‌ 13, ఉషు 6.


అర్హత వివరాలు: సాయ్‌/ ఎన్‌ఎస్‌/ ఎన్‌ఐఎస్‌ లేదా గుర్తింపు పొందిన ఇండియన్‌/ ఫారిన్‌ యూనివర్సిటీల నుంచి డిప్లొమా ఇన్‌ కోచింగ్‌ కోర్సు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒలింపిక్‌/ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నవారు, ద్రోణాచార్య అవార్డు  పొందినవారు కూడా అర్హులే. దరఖాస్తు నాటికి అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు. 



ఎంపిక: సంబంధిత క్రీడపై అభ్యర్థుల అవగాహనను అంచనా వేసేందుకు ఓరల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. ఖాళీలకు అయిదింతలకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన పక్షంలో సంస్థ నిర్దేశించిన మార్కింగ్‌ క్రయిటీరియా ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి సాధించిన క్రీడా విజయాలు, అనుభవం, విద్యార్హతలకు 50; ఇంటర్వ్యూకి 50 మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూలో కోచింగ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ నాలెడ్జ్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. 


ముఖ్య సమాచారం

ఒప్పంద వ్యవధి: నాలుగేళ్లు (మరో నాలుగేళ్లు పొడిగించే వీలుంది)

ప్రారంభ వేతనం: నెలకు రూ.41,420 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10

వెబ్‌సైట్‌: sportsauthorityofindia.nic.in


ఇది కూడా చదవండి..

ఏపీలో స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు.. రూ.లక్ష వరకు జీతం.. ఖాళీలు ఎన్నంటే..

Updated Date - 2021-08-28T13:53:47+05:30 IST