జాదవ్‌లో అంత కసి కనిపించిందా?

ABN , First Publish Date - 2020-10-21T08:45:02+05:30 IST

చెన్నై సూపర్‌కింగ్స్‌ యువ ఆటగాళ్లలో కసి కనిపించలేదంటూ ధోనీ చేసిన వ్యాఖ్యలను టీమిండియా మాజీ క్రికెటర్‌, సెలెక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ కొట్టిపారేశాడు. అతడి మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నాడు. యువతలో కనిపించని తపన.. ఫామ్‌లోలేని కేదార్‌ జాదవ్‌లో కనిపించిందా? అని ఎద్దేవా చేశాడు

జాదవ్‌లో అంత కసి కనిపించిందా?

అబుదాబి: చెన్నై సూపర్‌కింగ్స్‌ యువ ఆటగాళ్లలో కసి కనిపించలేదంటూ ధోనీ చేసిన వ్యాఖ్యలను టీమిండియా మాజీ క్రికెటర్‌, సెలెక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ కొట్టిపారేశాడు. అతడి మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నాడు. యువతలో కనిపించని తపన.. ఫామ్‌లోలేని కేదార్‌ జాదవ్‌లో కనిపించిందా? అని  ఎద్దేవా చేశాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో చిత్తుగా ఓడిన చెన్నై.. ప్లేఆ్‌ఫ్సకు దాదాపుగా దూరమైంది. ఈ నేపథ్యంలో టీమ్‌ సెలెక్షన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ‘జట్టులోని సీనియర్లకు సవాల్‌ విసిరి తుది జట్టులో చోటు దక్కించుకొనేంత కసి.. యువ ఆటగాళ్లలో కనిపించలేదు. అందుకే వాళ్లకు చోటు కల్పించలేదు. లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో వారికి అవకాశం కల్పిస్తాం. స్వేచ్ఛగా ఆడుకోవచ్చు’ అని అన్నాడు. అయితే, మహీ మాటలు అర్థం లేనివని శ్రీకాంత్‌ అన్నాడు. ‘జట్టు ఎంపిక ప్రక్రియే లోప భూయుష్టం. అన్‌క్యా్‌ప్డ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జగదీశన్‌లో లేని కసి.. జాదవ్‌లో ఉందా? ఇది హాస్యాస్పదం. లీగ్‌లో చైన్నై కథ ముగిసింది’ అని శ్రీకాంత్‌ అన్నాడు.

Updated Date - 2020-10-21T08:45:02+05:30 IST