Abn logo
Oct 23 2021 @ 11:32AM

హయత్‌నగర్ మర్డర్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

హైదరాబాద్: హయత్ నగర్‌లో కారులో మృతదేహం లభ్యమైన కేసులో పోలీసుల విచారణకు సంబంధించి కీలక విషయాలు వెలుగు చూశాయి. దారుణ హత్యకు గురి అయిన వ్యక్తి ని కాచిగూడకి చెందిన మహుమద్ ముస్తాక్ పటేల్‌గా గుర్తించారు. మృతుడు లారీ డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన అనంతరం నగర శివారులలో మృతదేహాన్ని పడేయడానికి దుండగులు వచ్చినట్టు తెలిసింది. అయితే రోడ్డుపై కారు ఆగిపోవడంతో మృత దేహంపై కారం చల్లి అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. 

తెలంగాణ మరిన్ని...