కేంద్ర ఉద్యోగులకు హెచ్‌బీఏ ప్రయోజనాల గడువు పొడిగింపు...

ABN , First Publish Date - 2021-06-25T00:27:27+05:30 IST

సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించే వారికి కేంద్రం ఊరట కలిగించింది. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్(హెచ్‌బీఏ) సంబంధిత ప్రయోజనాలను మరికొంత కాలం పొడిగించింది. ఈ క్రమంలో... కేంద్ర ప్రభుత్వోద్యుగులకు ఊరట కలుగనుంది.

కేంద్ర ఉద్యోగులకు హెచ్‌బీఏ ప్రయోజనాల గడువు పొడిగింపు...

న్యూఢిల్లీ : సొంతింటి కలను సాకారం చేసుకోవాలని  భావించే వారికి కేంద్రం ఊరట కలిగించింది. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్(హెచ్‌బీఏ) సంబంధిత  ప్రయోజనాలను మరికొంత కాలం పొడిగించింది. ఈ క్రమంలో... కేంద్ర ప్రభుత్వోద్యుగులకు ఊరట కలుగనుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


హెచ్‌బీఏ ప్రయోజాన్ని 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు కేంద్రం  వెల్లడించింది. ఉద్యోగులు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కింద ఇంటి కోసం ముందుగానే డబ్బులు తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబరు 1  నుంచి ఈ వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


ఏడవ వేతన సంఘం పే మెట్రిక్స్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్‌బీఏ నిబంధనలను అప్‌డేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు, అలాగే ఐదేళ్లకు పైబడి సర్వీస్ కలిగిన తాత్కాలిక ఉద్యోగులు ఇంటి కొనుగోలు కోసం హెచ్‌బీఏ కింద రుణాన్ని తీసుకోవచ్చు.

Updated Date - 2021-06-25T00:27:27+05:30 IST