Advertisement
Advertisement
Abn logo
Advertisement

శివ్‌లాల్‌, అర్షద్‌కు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)కు సంబంధించిన పలు ఏసీబీ కేసులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేసిన మాజీ క్రికెటర్లు శివ్‌లాల్‌, అర్షద్‌ అయూబ్‌కు చుక్కెదురైంది. ఏసీబీ తమపై మోపిన అభియోగాలను డిస్మిస్‌ చేయాలని హైకోర్టులో వీరు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మంగళవారం విచారణ జరిపారు. ఏసీబీ కోర్టు ట్రయల్స్‌కు హాజరై తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని పిటిషనర్లకు న్యాయమూర్తి సూచించారు. ఇక, 2000 నుంచి 2012 మధ్య స్టేడియం నిర్మాణం, దానికి సంబంధించిన వివిధ కాంట్రాక్టుల విషయంలో కోట్లలో అవినీతి జరిగినట్టు సాగర్‌ క్రికెట్‌ క్లబ్‌ కార్యదర్శి బాబూరావు గతంలో ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేసిన ఏసీబీ.. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు శివ్‌లాల్‌, అర్షద్‌, జి.వినోద్‌తో పాటు ప్రస్తుత ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌, కార్యదర్శి విజయానంద్‌, కోశాధికారి సురేంద్ర అగర్వాల్‌పై అభియోగాలు మోపడం విదితమే.

Advertisement
Advertisement