Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిస్వార్ధ సేవకు చిరు సత్కారం.. లోకమణి అమ్మకు హెచ్‌సీసీబీ ప్రశంసాపత్రం

అమరావతి: ఎండలో పనిచేస్తున్న పోలీసులకు కూల్‌డ్రింక్స్ అంజేసి గొప్ప మనసు చాటుకున్న లోకమణి అమ్మకు హిందుస్తాన్ కోకా-కోలా బేవరేజస్(హెచ్‌సీసీబీ) చిరు సత్కారం అందించింది. ఆమె మానవత్వాన్ని ఎంతగానో మెచ్చుకున్న హెచ్‌సీసీబీ సీఈవో క్రిస్టీనా రుజిరో లోకమణి అమ్మను ప్రశంసిస్తూ వ్యక్తిగతంగా లేఖరాశారు. అంతేకాకుండా సంస్థ తరపున ఆమెకు ప్రశంశా పత్రం అందజేసి సత్కరించారు. కంపెనీ మర్చండైజ్‌ను బహూకరించారు. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా, తునిలో లోకమణి అమ్మ కేర్‌టేకర్‌గా 3,500 జీతానికి పనిచేస్తున్నారు. గత నెల ఆమె జీతం తీసుకుని ఇంటికి వెళుతుండగా మండుటెండలో పనిచేస్తున్న పోలీసులు కనపడ్డారు.


వారిని చూడగానే ఆమెకు బాధకలిగింది. అంతే వెంటనే తన వద్ద ఉన్న డబ్బులో నుంచి రూ.190 ఖర్చుచేసి 2.25 లీటర్ల కూల్‌డ్రింక్ బాటిళ్లు కొని వారికి అందించింది. తమపై ఆమె చూపిన ఔదార్యానికి పోలీసులు కూడా ఎంతో సంతోషించారు. ఈ విషయం తెలుసుకున్న డీజీసీ సవాంగ్ కూడా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.


Advertisement
Advertisement