హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు లాభం రూ.7703 కోట్లు

ABN , First Publish Date - 2020-10-18T06:41:53+05:30 IST

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు రెండో త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ లాభంలో 16 శాతం వృద్ధిని ప్రకటించింది. సెప్టెంబరు 30వ

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు లాభం రూ.7703 కోట్లు

న్యూఢిల్లీ : హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు రెండో త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ లాభంలో 16 శాతం వృద్ధిని ప్రకటించింది. సెప్టెంబరు 30వ తేదీతో ముగిసిన త్రైమాసికంలో రూ.38,438.47 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.7703 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన కన్సాలిడేటెడ్‌ లాభం రూ.6638 కోట్లు.


ఇదే కాలానికి స్టాండ్‌ అలోన్‌ నికరాదాయం రూ.36,069.42 కోట్లకు చేరగా నికరలాభం 18.4 శాతం వృద్ధితో  రూ.7513.10 కోట్లు. స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 1.08 శాతం తగ్గి రూ.12,508.15 కోట్లకు దిగి రాగా, నికర ఎన్‌పీఏలు 0.17 శాతం తగ్గి రూ.1756.08 కోట్లకు చేరాయి.

అయితే ఎన్‌పీఏలకు ప్రావిజనింగ్‌ మాత్రం రూ.2700.68 కోట్ల నుంచి రూ.3703.50 కోట్లకు పెంచాల్సివచ్చింది. మంజూరు చేసిన మొత్తం రుణాలు 14.9 శాతం పెరిగి రూ.10.89 లక్షల కోట్లకు చేరాయి.  


Updated Date - 2020-10-18T06:41:53+05:30 IST