రిటైల్‌ రుణాల్లో రూ. 66 వేల కోట్లకుఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌...

ABN , First Publish Date - 2021-01-07T21:26:32+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) మూడో త్రైమాసికంలో రిటైల్‌ రుణాలలో 24 శాతం వృద్ధితో రూ. 66,635 కోట్లకు చేరుకునట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ వెల్లడించింది. వెరసి క్యూ3(అక్టోబరు- డిసెంబరు‌)లో ఫండెడ్‌ ఆస్తులు(రుణాలు) 0.7 శాతం పెరిగి రూ. 1.1 ట్రిలియన్లను తాకినట్లు తెలియజేసింది.

రిటైల్‌ రుణాల్లో రూ. 66 వేల కోట్లకుఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌...

హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) మూడో త్రైమాసికంలో రిటైల్‌ రుణాలలో 24 శాతం వృద్ధితో రూ. 66,635 కోట్లకు చేరుకునట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ వెల్లడించింది. వెరసి క్యూ3(అక్టోబరు- డిసెంబరు‌)లో ఫండెడ్‌ ఆస్తులు(రుణాలు) 0.7 శాతం పెరిగి రూ. 1.1 ట్రిలియన్లను తాకినట్లు తెలియజేసింది.


పీఎస్‌ఎల్‌ కొనుగోళ్లతో కలిపి రిటైల్‌ ఫండెడ్‌ అసెట్స్‌ వాటా 64 శాతానికి చేరినట్లు వెల్లడించింది. మొత్తం డిపాజిట్లు 41 శాతం పెరిగి రూ. 77,289 కోట్లకు చేరగా.. వీటిలో రిటైల్‌ విభాగం 100 శాతం జంప్‌చేసి రూ. 58,435 కోట్లను తాకినట్లు పేర్కొంది. ఈ నేపధ్యంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 44.35 వద్ద ట్రేడవుతోంది. తద్వారా గత జనవరి 20న సాధించిన ఏడాది గరిష్టం రూ. 45.5కు చేరువైంది.

Updated Date - 2021-01-07T21:26:32+05:30 IST