ఆస్పత్రి సిబ్బంది దాడి.. కరోనా రోగి మృతి! సిబ్బందే కారణమన్న బంధువులు

ABN , First Publish Date - 2020-09-19T18:44:40+05:30 IST

: గుజరాత్ ఆస్పత్రి సిబ్బంది చేతిలో దెబ్బలు తిన్న కరోనా రోగి వీడియో ఇటీవల తెగ వైరల్ అయింది. అయితే.. కరోనా కారణంగా అతడు మృతి చెందినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ.. బాధితుడు ప్రభాకర్ పాటిల్ మరణానికి కారణం ఆస్పత్రి వర్గాలేనని బంధులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 12న ప్రభాకర్ రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రిలో కన్నుమూసినట్టు ఆయన తమ్ముడు వికాస్ పాటిల్ తెలిపారు.

ఆస్పత్రి సిబ్బంది దాడి.. కరోనా రోగి మృతి! సిబ్బందే కారణమన్న బంధువులు

గాంధీనగర్: గుజరాత్ ఆస్పత్రి సిబ్బంది చేతిలో దెబ్బలు తిన్న కరోనా రోగి వీడియో ఇటీవల తెగ వైరల్ అయింది. అయితే.. కరోనా కారణంగా అతడు మృతి చెందినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ.. బాధితుడు ప్రభాకర్ పాటిల్ మరణానికి కారణం ఆస్పత్రి వర్గాలేనని బంధులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 12న ప్రభాకర్ రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రిలో కన్నుమూసినట్టు ఆయన తమ్ముడు వికాస్ పాటిల్ తెలిపారు.


అంతకుమనుపు.. ఆస్పత్రి  సిబ్బంది ఆయనను దారుణంగా కొట్టారని వికాస్ ఆరోపించాడు. కరోనాతో ప్రభాకర్ మృతి చెందాడని తెలిసినా పార్థివ దేహాన్ని తమకు అప్పగించారని ఆయన ఆరోపించాడు. మరోవైపు.. ఎటువంటి కరోనా ప్రోటోకాల్ పాటించకుండానే ప్రభాకర్ అంత్యక్రియలు జరిగినట్టు తెలుస్తోంది.


కాగా.. పన్నెండు రోజుల క్రితం ప్రభాకర్ కిడ్నీ సంబంధిత సమస్యలతో రాజ్ కోట్ సివిల్ ఆస్పత్రిలో చేరారు. ఆ తరువాత.. కిడ్నీలో నీరు చేరిందని బయటపడటంతో వైద్యులు శస్త్ర చికత్స ద్వారా నీటిని తొలగించారు. అనంతరం.. తనకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వస్తోందని ప్రభాకర్ చెప్పడంతో వైద్యులు అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో అతడిపై ఆస్పత్రి సిబ్బంది దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


అయితే.. తాము అతడిపై దాడి చేయలేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ప్రభాకర్ మతి స్థిమితం లేనట్టు ప్రవర్తిస్తుండటంతో అతడిని కేవలం అదుపు చేసేందుకు మాత్రమే ప్రయత్నించామని, కానీ వీడియో చూసిన వారు మాత్రం తాము దాడి చేస్తున్నట్టు భావించారని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. అయితే..ఆస్పత్రి వర్గాల దాడి కారణంగానే ప్రభాకర్ మరణించాడంటూ ప్రస్తుతం బంధువులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-09-19T18:44:40+05:30 IST