May 5 2021 @ 09:48AM

ఆయనతో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి : పూజా హెగ్డే

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే.. ఆయనతో కలిసినప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్న విషయాలు చాలా ఉన్నాయి.. అంటూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆయన అంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. కోవిడ్ ప్రభావం లేకపోయి ఉంటే ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించాల్సిన 'కభీ ఈద్‌ కభీ దీవాలి' సినిమా రిలీజయి ఉండేది. కానీ కరోనా మూలంగా ఇప్పటి వరకు ఈ సినిమా మొదలవలేదని తెలిపింది. అంతేకాదు సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు.. సెట్స్‌లో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాలనుకుంటున్న విషయాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చింది. 'కభీ ఈద్‌ కభీ దీవాలి' కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని.. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పింది పూజా హెగ్డే. ఇక ఇటీవల కోవిడ్‌ పాజిటివ్‌తో హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటున్న పూజా ..కోవిడ్‌ నుంచి బాగానే రికవర్ అయిందట. కాగా రణ్‌వీర్‌సింగ్‌ సరసన 'సర్కస్‌' సినిమాలో నటిస్తుంది.