Sep 19 2021 @ 00:50AM

టీజర్‌లో ఉన్న ‘అతడెవడు’

సాయికిరణ్‌ కోనేరి, వికాసిని, జ్యోతీ సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ‘అతడెవడు’ చిత్రం టీజర్‌ను శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో దర్శకులు చంద్రమహేశ్‌, తోట వేణు సంయుక్తంగా విడుదల చేశారు. పోస్టర్‌ను తుమ్మల ప్రసన్నకుమార్‌, నటుడు జాకీ విడుదల చేశారు. ఈ సినిమా విజయం సాధించాలని ప్రసన్నకుమార్‌, చంద్రమహేశ్‌ ఆకాంక్షించారు. నిర్మాత తోట సుబ్బారావు మాట్లాడుతూ ‘దర్శకుడు నాకు ఈ కథ చెప్పగానే బాగా నచ్చేసింది. వెంటనే షూటింగ్‌ ప్రారంభించాం. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేశాం’ అని తెలిపారు.


దర్శకుడు వెంకట్‌రెడ్డి నంది మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెలాఖరున ఆడియో విడుదల చేస్తాం. వచ్చే నెల్లో సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.