అతనో ప్రత్యేక బౌలర్.. సిరాజ్‌పై కోహ్లీ ప్రశంసలు

ABN , First Publish Date - 2021-04-20T09:43:29+05:30 IST

యువ పసర్ మొహమ్మద్ సిరాజ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు.

అతనో ప్రత్యేక బౌలర్.. సిరాజ్‌పై కోహ్లీ ప్రశంసలు

ముంబై: యువ పసర్ మొహమ్మద్ సిరాజ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో బెంగళూరు జట్టు విజయం సాధించడంలో సిరాజ్ పాత్ర కూడా చాలా ఉంది. విండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ బ్యాటింగ్ చేస్తుండగా 19వ ఓవర్ వేసిన సిరాజ్.. కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. దీంతో కోల్‌కతా తేరుకోలేకపోయింది. దీని గురించి మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ‘‘ఆస్ట్రేలియా టూర్ నుంచి సిరాజ్ ప్రత్యేకంగా మారాడు. అతను గేమ్‌ను అలా మూసేయగలడు’’ అని చెప్పాడు. కాగా, ఈసారి ఐపీఎల్ టోర్నీలో బెంగళూరు జట్టు ఆడిన తొలి మూడు మ్యాచులు గెలిచింది. ఇలా టోర్నీలో తొలి మూడు మ్యాచులు గెలవడం 14ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బెంగళూరుకు ఇదే తొలిసారి.

Updated Date - 2021-04-20T09:43:29+05:30 IST