Abn logo
Sep 20 2021 @ 18:47PM

విమానం దొరకలేదని నెల రోజులు సముద్రంలోనే...

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన పాల్ స్ట్రాట్‌పోల్డ్ అనే ప్రొఫెషనల్ సెయిలర్ అందర్ని ఆశ్చర్యపరిచే సాహసం చేశాడు. తానున్న తాహితీ నుంచి విమాన ప్రయాణం చేసేందుకు కావాల్సిన డబ్బు లేకపోవడంతో తన స్వస్థలానికి చేరుకోవడానికి సముద్రంలో 6వేల కిలోమీటర్లు సెయిలింగ్ చేశాడు. తన వీసాను రెన్యువల్ చేసుకోవడానికి గడువు మించిపోతుండటంతో ఆయన ఈ సాహసానికి పూనుకున్నాడు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో దాదాపుగా నెలరోజులు ప్రయాణించి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. అయితే 41 సంవత్సరాల స్ట్రాట్‌పోల్డ్ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. సెయిలింగ్ చేస్తున్న సమయంలో రెండు రోజుల పాటు తుఫానులు రావడంతో ఆయన ప్రయాణిస్తున్న 50 అడుగుల తెరచాప అతలాకూతలమైంది. ఫలితంగా అలలను తప్పించుకోవడానికి నిద్రలేని రాత్రులెన్నో గడిపాడు. ‘‘ నేను ఇంటికి రావడానికి ఈ ఒక్క దారి మాత్రమే ఉంది ’’ అని క్వీన్స్‌లాండ్ లోని సౌత్‌పోర్ట్ చేరుకున్న అనంతరం ఆయన వివరించాడు.  కొవిడ్ విలయతాండవం చేస్తున్న సమయంలో ఇటువంటి ప్రయాణాలు సర్వసాధారణంగా మారాయి. ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తూ క్వారంటైన్ నిబంధనలను కఠినతరం చేశాయి. ఫలితంగా కరోనా సంక్షోభ సమయంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన వేలాదిమంది విదేశాల్లోనే ఇరుక్కుపోయారు.

ప్రత్యేకంమరిన్ని...