ఫొటో చూస్తే చెప్పేస్తాడు

ABN , First Publish Date - 2021-06-29T05:30:00+05:30 IST

ప్రముఖుల చిత్రాలు ముందు పెడితే చాలు.. వారిని చకచకా గుర్తుపట్టేస్తాడు. అందులో విశేషముంది? ప్రముఖుల

ఫొటో చూస్తే చెప్పేస్తాడు

ప్రముఖుల చిత్రాలు ముందు పెడితే చాలు.. వారిని చకచకా గుర్తుపట్టేస్తాడు. అందులో విశేషముంది? ప్రముఖుల చిత్రాలు ఎవరైనా గుర్తుపడతారని అంటారా? ఆ బుడతడి వయస్సు నాలుగేళ్లు. ఈ వయస్సులోనే వంద మంది ప్రముఖుల చిత్రాలను గుర్తుపట్టేస్తున్నాడు.


హైదరాబాద్‌కు చెందిన సాయి అభిరామ్‌ ప్రతిభ ఇది. ఈ బుడతడి వయస్సు తక్కువే కానీ ప్రతిభలో మాత్రం మిన్న.  ఈ చిన్నారి భారతీయ ప్రముఖుల ఫొటోలను గుర్తించడంలో దిట్ట. శివాజీ, తాంతియా తోపే, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌సింగ్‌, సి.వి.రామన్‌, మదన్‌ మోహన్‌ మాలవీయ, డా. బి.ఆర్‌.అంబేదర్కర్‌, దయానంద సరస్వతి... ఇలా వంద మంది ప్రముఖుల ఫొటోలు చూపిస్తే చకచకా వాళ్ల పేర్లు చెప్పేస్తాడు. అది కూడా 6 నిమిషాల్లోనే. అందుకే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించాడు. 


Updated Date - 2021-06-29T05:30:00+05:30 IST