Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేమ పేరుతో వంద మందిని ట్రాప్ చేశాడు.. కలిసి బతుకుదామని టౌన్‌కు తీసుకెళ్లేవాడు.. ఇప్పుడు అతని బండారం బయటపడింది!

ఇటీవల ఇండోర్‌లో బయటపడిన సెక్స్ రాకెట్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఆ సెక్స్ రాకెట్‌ను నడిపిన అధిపతి విజయ్ దత్ కంటే బబ్లూ విశ్వాస్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్టు విచారణలో తేలింది. కోల్‌కతాకు చెందిన బబ్లూ విశ్వాస్ అనే వ్యక్తి అమ్మాయిలను మోసగించి వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించినట్టు బయటపడింది. 


ప్రేమ పేరుతో అతను వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు వంద మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడట. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, కలిసి బతుకుదామని చెప్పి కోల్‌కతా, ముంబై, ఇండోర్ వంటి నగరాలకు తీసుకెళ్లేవాడట. అక్కడ వారికి డబ్బు ఆశ చూపించి బలవంతంగా వ్యభిచారం చేయించేవాడట. అంతేకాదు ఇతర దేశాల నుంచి ఏజెంట్లు తీసుకొచ్చే అమ్మాయిలను కూడా కొనేవాడట. ఇటీవల అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి దాదాపు 200లకు పైగా ఫేక్ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 


ఫేక్ ఆధార్ కార్డులతో వివిధ నగరాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని అక్కడ బబ్లూ వ్యభిచారం నిర్వహించేవాడట. ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో బబ్లూకు నెట్‌వర్క్ ఉందట. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కు వలస వచ్చే అమ్మాయిలు చాలా మంది బబ్లూ పర్యవేక్షణలోనే ఉంటున్నట్టు తేలింది. ఇటీవల ఈ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు కావడంతో బబ్లూ, అతడి బాస్ విజయ్ తాజాగా పోలీసులకు చిక్కి జైలు జీవితం అనుభవిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement