495 పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదేదీ..!?

ABN , First Publish Date - 2021-03-06T06:19:25+05:30 IST

కరోనా ఉధృతి తగ్గి నందున పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ స్టూడెంట్‌ యాప్‌లో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుం చి ఒక్క విద్యార్థి హాజరును నమోదు చేయకపోవడాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

495 పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదేదీ..!?

హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులు 

జారీ చేయాలని ఆర్జేడీ ఆదేశాలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 5 : కరోనా ఉధృతి తగ్గి నందున పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ స్టూడెంట్‌ యాప్‌లో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుం చి ఒక్క విద్యార్థి హాజరును నమోదు చేయకపోవడాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ యాప్‌లో హాజరు నమోదును పర్యవేక్షణకు డివిజన్ల వారీగా కమిటీలు వేయాలని ఆదేశించినప్పటికీ పట్టించు కోకపోవడంతో విద్యాశాఖాధికారులపై మండిపడ్డారు. యాప్‌లో విద్యార్థుల హాజరును నమోదు చేయని 495 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీచేయాలని కాకినాడ ఆర్జేడీ నరసింహారావు శుక్రవా రం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది స్టూడెంట్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతీ రోజు స్కూలు పనివేళలు ప్రారంభమైన అర గంటలోగా తరగతుల వారీగా హాజరైన విద్యార్థుల సంఖ్యను పాఠశాల హెచ్‌ఎం నిర్దేశిత యాప్‌లో నమోదుచేయాలి. ఈ ప్రక్రియ అమలు లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతో కూడిన జోన్‌ రాష్ట్రంలోనే చివరి స్థాయిలో ఉంది. దీంతో కాకినాడ ఆర్జేడీ సీరియస్‌ అయ్యారు. శుక్రవారం ఉదయమే జిల్లా విద్యా శాఖాధికారులతో సంభాషించారు. స్టూడెంట్‌ యాప్‌ నిర్వ హణపై పర్యవేక్షక కమిటీలను నియమించాలని తాను గతంలో ఆదేశాలు జారీచేసినా అమలు చేయకపోవడం పై మండిపడ్డారు. ఇదే నిర్లక్ష్యాన్ని ఇకపై కొనసాగిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. అప్రమత్తమైన జిల్లా విద్యా శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 

Updated Date - 2021-03-06T06:19:25+05:30 IST