సీఎం సార్‌.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి

ABN , First Publish Date - 2021-06-18T04:52:16+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖలో గత 20 ఏళ్లగా కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్లుగా సేవలందిస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

సీఎం సార్‌.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి
పాలకోడేరులో కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్ల అర్ధనగ్న ప్రదర్శన

కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్ల నిరసన ప్రదర్శన

పాలకోడేరు/పెనుమంట్ర, జూన్‌ 17 : వైద్య ఆరోగ్య శాఖలో గత 20 ఏళ్లగా కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్లుగా సేవలందిస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పలువురు ఉద్యోగులు పాలకోడేరు, పెనుమంట్ర పీహెచ్‌సీల వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేశారు.నాడు సీఎం జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా కాంట్రాక్టు ఉద్యోగుల కోర్కెలు నెరవేరకపోవడంతో గత కొన్ని రోజులుగా వివిధ పద్దతుల్లో నిరసన చేస్తున్నామన్నారు. పాలకోడేరు హెల్త్‌ అసిస్టెంట్లు శ్రీను, ఎస్‌కె. సాహెబ్‌, వైఎస్సార్‌ గోపాలకృష్ణ అర్ధనగ్న ప్రదర్శన చేశారు.  రెగ్యులర్‌ ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సురేష్‌, చంద్రారెడ్డి, కృష్ణస్వామి, పెద్దేరావు, ఏన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T04:52:16+05:30 IST