ఒక్కసారి కొత్త వూరు వెళ్లి రండి..

ABN , First Publish Date - 2021-01-17T16:17:23+05:30 IST

మీకు ఈ సంగతి తెలుసా? తరచూ పర్యటక ప్రదేశాలకు వెళ్లేవారు, టూర్లు వేసేవాళ్లు అదృష్టవంతులట..

ఒక్కసారి కొత్త వూరు వెళ్లి రండి..

మీకు ఈ సంగతి తెలుసా? తరచూ పర్యటక ప్రదేశాలకు వెళ్లేవారు, టూర్లు వేసేవాళ్లు అదృష్టవంతులట.. గాలి మార్పు మంచిదే. నిజానికి వేకేషన్ మనసుకు అతిపెద్ద చికిత్స. గాలి మార్పు ఉండాలని మానసిక నిపుణులు చెప్పేది ఇందుకే. మానసిక రుగ్మతలైన డిప్రెషన్, ప్రస్టేషన్ వంటివి రాకుండా ఉండాలన్నా.. కొత్త ఊరుకు వెళ్లి చూడండి.. మనసు కుదుటపడి రెట్టించిన జోష్‌తో ఇంటికి వస్తారు. ఈ విషయాన్ని ఓ తాజా అధ్యయనం శాస్త్రీయంగా రుజువుచేస్తోంది. దూరంగా ప్రయాణించేవారి అనుభవాన్ని విశ్లేషించారు. వారు మానసికంగా ఎంతో ఉత్సాహంగా.. మిగతావారితో పోలిస్తే 7శాతం ఎక్కువ హ్యాపీగా ఉన్నట్టు తేలింది. వెయ్యి పుస్తకాలు చదవడంకన్నా పది ఊళ్లు చుట్టేసివస్తే జ్ఞానం, అనుభవం ఎంతో డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే ఏడాదికి ఒక్కసారన్న ఒక కొత్త ప్రదేశానికి వెళ్లడం ఎంతో ఆరోగ్యం.

Updated Date - 2021-01-17T16:17:23+05:30 IST