వైద్యశాఖకు దొంగ జ్వరం!

ABN , First Publish Date - 2021-01-19T05:17:45+05:30 IST

వైద్యశాఖకు దొంగ జ్వరం!

వైద్యశాఖకు దొంగ జ్వరం!
టీకా వేయించుకుంటున్న ఆర్‌ఎంవో డాక్టర్‌ బొల్లికొండ శ్రీనివాసరావు

కొవిడ్‌ వ్యాక్సిన్‌కు భయపడుతున్న కొందరు ఉద్యోగులు

వ్యాధులను సాకుగా చూపుతున్న వైనం

నేటినుంచి ఖమ్మం జిల్లాలో 30 కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలు

ఖమ్మంసంక్షేమవిభాగం, జనవరి 18: చిన్న పిల్లలు బడి మానేసేందుకు ‘దొంగజ్వరం’ సాకు చెబుతూ ఉంటారు. సరిగ్గా ఇదే తంతు వైద్యఆరోగ్యశాఖలో జరుగుతోందంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. కొవిషీల్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు భయపడుతున్న కొం దరు వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు జ్వరం సాకు గా చూపుతున్నారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా లో తొలివిడతలో 12,800మంది ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. దశలవారీగా వ్యాక్సిన్‌ కేంద్రాల సంఖ్యను పెంచుతున్నారు. అయితే వైద్యశాఖలోని కొంతమంది ఉద్యోగులు వ్యాక్సిన్‌ తీసుకోవడం ఇష్టంలేక జ్వరం వచ్చిం దని తప్పించుకుంటున్న సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం 712మందికి టీకా ఇవ్వడం లక్ష్యం కాగా.. 599మంది తీసుకున్నా రు. వ్యాక్సిన్‌ తీసుకొని వారితో కారణాలు, సంతాకాలను నిర్ణీత ఫారమ్‌లో తీసుకున్నారు. అయితే ఇలా సాకులు చెప్పినవారిలో పురుష ఉద్యోగులే ఉన్నట్టు తెలుస్తోంది. 

మరో 15కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌..

రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలతో మంగళ వారంనుంచి మరో 15ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నారు. శనివారం ఆరు కేంద్రాలు, సోమవారం మరో 9కేంద్రాల్లో ప్రారంభించగా.. మంగళవారం నుంచి మరో 15ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిలో చింతకాని, మాటూరుపేట, గంగారం, ముది గొండ, ఎంవీపాలెం, కొణిజర్ల, ఏన్కూరు, లంక సాగర్‌, వేంసూరు, కామేపల్లి, బనిగండ్ల పాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అలాగే ఖమ్మం నగరంలోని శ్రీనివాస్‌నగర్‌, మామిళ్ల గూడెం అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసు పత్రిలోని ఏఎన్‌ఎం సెంటర్‌, లెప్రసీ వార్డులో వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా ఆసు పత్రిలో జరుగుతున్న ఏర్పాట్లను ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సోమవారం పరిశీలించారు.

భద్రాద్రి జిల్లాలో మరో 30కేంద్రాలు.. 

కొత్తగూడెం కలెక్టరేట్‌: భద్రాద్రి జిల్లాలో శని, సోమవారాల్లో మొత్తం 14కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరగ్గా.. వాటికి మరో 30కేంద్రాలను జోడిం చారు. వీటిని మంగళవారం నుంచి అందుబా టులోకి తేనున్నారు. సోమవారం మొత్తం 14 కేంద్రాల్లో 700మందికి టీకాలు వేయాల్సి ఉండ గా 699మందికి ఇచ్చారు. తాజాగా మరో 30 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడం తో జిల్లాలో వ్యాక్సినేషన్ల సంఖ్య మొత్తం 44కు చేరింది. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకున్న వారంతా సురక్షితంగా ఉన్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు. వైద్య సిబ్బందితోపాటు ఆశా, ఆరోగ్య, కార్యకర్తలు, స్టాప్‌నర్సులు, పారిశుధ్య కార్మికులు, వైద్యులు వ్యాక్సినేషన్‌ తీసుకొన్నవారి లో ఉన్నారు. డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌, జిల్లా టీకాల అధికారి నాగేంద్రప్రసాద్‌, సీహెచ్‌ వోనాగభూషణం, ప్రోగ్రాం అధికారులు, వ్యాక్సిన్‌ కో మేనేజర్‌ రాజేష్‌, మధు, పర్యవేక్షించారు.

Updated Date - 2021-01-19T05:17:45+05:30 IST