కొవిడ్‌ నిబంధనలు పాటించండి: ఆరోగ్య శాఖ

ABN , First Publish Date - 2020-06-05T07:48:22+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తమ ఉద్యోగులకు సూచించింది. పలువురు అధికారులు వైరస్‌ బారినపడటం, కార్యాలయ(నిర్మాణ భవన్‌) ప్రాంగణంలో భౌతికదూరం అమలు కాకపోతుండటంతో ఈ ఆదేశాలు జారీ చేసింది...

కొవిడ్‌ నిబంధనలు పాటించండి: ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ, జూన్‌ 4: కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తమ ఉద్యోగులకు సూచించింది. పలువురు అధికారులు వైరస్‌ బారినపడటం, కార్యాలయ(నిర్మాణ భవన్‌) ప్రాంగణంలో భౌతికదూరం అమలు కాకపోతుండటంతో ఈ ఆదేశాలు జారీ చేసింది. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, అనారోగ్య లక్షణాలు లేనివారిని మాత్రమే విధులకు అనుమతిస్తామని తెలిపింది. సదస్సులు, సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే నిర్వహించాలని, అవసరమైతే ఇంటి నుంచే పనిచేసే వీలు కల్పించాలని పేర్కొంది. 


Updated Date - 2020-06-05T07:48:22+05:30 IST