ఆరోగ్య బీమా పథకాలపై నిపుణుల కమిటీ

ABN , First Publish Date - 2021-01-14T06:44:48+05:30 IST

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి(ఐఆర్‌డీఏఐ) బుధవారం నాడు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఆరోగ్య బీమా పథకాలపై నిపుణుల కమిటీ

న్యూఢిల్లీ: భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి(ఐఆర్‌డీఏఐ) బుధవారం నాడు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య బీమా పథకాల లభ్యతను పరిశీలించడంతోపాటు తగిన పథకాలు, ప్రక్రియలను సిఫారసు చేసేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది. గడిచిన కొన్నేళ్లలో ఆరోగ్య బీమా ఆవశ్యకత గణనీయంగా పెరిగిందని, మున్ముందు కాలంలో మరింత పెరగనుందని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. 


ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకోండి.. 

ఇతర వ్యాధుల్లాగే కొవిడ్‌-19 చికిత్స ఖర్చులకు సంబంధించి ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకోవాలని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ నిర్దేశించింది. 

Updated Date - 2021-01-14T06:44:48+05:30 IST