చిట్టి తల్లికి.. పెద్ద కష్టం

ABN , First Publish Date - 2022-01-21T05:12:40+05:30 IST

కనులు తెరిచీ తెరవకమునుపే ఆ చిట్టి తల్లికి పెద్ద కష్టం వచ్చి పడింది.

చిట్టి తల్లికి.. పెద్ద కష్టం

వైద్యానికి సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు


ద్వారకాతిరుమల, జనవరి 20: కనులు తెరిచీ తెరవకమునుపే ఆ చిట్టి తల్లికి పెద్ద కష్టం వచ్చి పడింది. పుట్టుకతోనే గుండెకు రెండు రంధ్రాలు ఉన్నాయని, రక్తప్రసరణ సక్రమంగా లేదన్న పిడుగులాంటి వార్త పేద కుటుంబాన్ని కుంగదీసింది. ద్వారకాతిరుమల వసంతనగర్‌ కాలనీకి చెందిన రామదాసు దుర్గాప్రసాద్‌ దివ్యాంగుడు. పెన్షన్‌తో పాటు చిన్నపాటి పను లు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 3న దుర్గాప్రసాద్‌ భార్య వీరవేణి కాకినాడ జనరల్‌ ఆసుపత్రిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పాలు తాగిన తర్వాత బిడ్డ శరీరం నీలిరంగులోకి రావడంతో పరీక్షిం చిన వైద్యులు విశాఖపట్నం తీసుకెళ్ళాలని సూచించారు. అక్కడి వైద్యులు విజయ వాడ ఆంధ్ర హాస్పిటల్‌కు రిఫర్‌ చేశారు. గుండెకు రెండు రంధ్రాలున్నాయని ఈ నెల 25 లోపు శస్త్రచికిత్స చేయాలన్నారు. రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో వారికి శరాఘాతమైంది. నిరుపేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. దాతలు చేయూతనిచ్చి చిన్ని ప్రాణాన్ని నిలబెట్టాలి.

Updated Date - 2022-01-21T05:12:40+05:30 IST